ఆరోగ్యవంతమైన జీవితానికి యోగా మార్గం
భారతీయ సంస్కృతి ప్రపంచానికి అందించిన గొప్ప ఆధ్యాత్మిక, ఆరోగ్య వారసత్వం యోగా అని, ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకుని ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవరచుకోవాలని ఆకాంక్ష స్వచ్ఛంద సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మర్ధాల రవిబాబు పిలుపునిచ్చారు. శనివారం రేణిగుంట మండలం ఆర్.మల్లవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆకాంక్ష స్వచ్ఛంద సేవా సంస్థ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ మానవ హక్కులు, సామాజిక అభివృద్ధి విభాగం సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మర్ధాల రవిబాబు మాట్లాడుతూ యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అత్యంత గొప్ప జీవన విధానమన్నారు. పతంజలి మహర్షి...