జాతీయ స్థాయి విజేతలకు కలెక్టర్ ఘన సన్మానం.. జపాన్‌కు వెళ్తున్న రేష్మకు అభినందనలు
జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన విద్యార్థినులను జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ అభినందించి సత్కరించారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఇన్‌స్పైర్ మనక్ జాతీయ స్థాయి పోటీల్లో విజయం సాధించి ఈ నెల 28 నుంచి జూలై 4 వరకు జపాన్‌లోని సకురాలో జరిగే అంతర్జాతీయ పోటీలకు ఎంపికైన రేణిగుంట మండలం గుత్తివారిపల్లి జెడ్పీ విద్యార్థిని గొల్లపల్లి రేష్మను కలెక్టర్ చాంబర్‌లో ఘనంగా సన్మానించి సీతారాముల కాంస్య విగ్రహం బహూకరించారు. అలాగే జాతీయ స్థాయి పెయింటింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని ఎం. ధన్యశ్రీని మెమొంటోతో సత్కరించారు. జిల్లాకు విద్యార్థులు గర్వకారణమని అధికారులు ప్రశంసించారు.