ఘనంగా గిరిజనుల ముద్దుబిడ్డ దారు నాయక్‌కు జన్మదిన వేడుకలు

రేణిగుంట మండలం గురవరాజుపల్లి ఎస్టీ కాలనీలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షులు, మాజీ ట్రైకార్ జిల్లా కార్పొరేషన్ చైర్మన్ ఎం.దారు నాయక్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. గిరిజనుల అభివృద్ధి, వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తున్న నాయకుడిగా గుర్తింపు పొందిన దారు నాయక్‌కు స్థానిక గిరిజనులు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గిరిజన సలహా మండలి సభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాసారపు సుబ్బయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. వేడుకల్లో పాల్గొన్న నాయకులు దారు నాయక్‌ను శాలువాలతో ఘనంగా సత్కరించి, పూలమాలలతో సన్మానించారు. అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన...