శ్రీవారి కృపతోనే విజయం సాధించాం.... బొజ్జల రిషితా రెడ్డి

రాజకీయ విజయాన్ని కేవలం వ్యక్తిగత విజయంగా కాకుండా దైవానుగ్రహం, ప్రజల ఆశీస్సుల ఫలితంగా భావిస్తూ మొక్కుకున్న మొక్కును నెరవేర్చుకునేందుకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సతీమణి రిషితా రెడ్డి చేపట్టిన తిరుమల పాదయాత్ర భక్తి, విశ్వాసం, కృతజ్ఞతలకు ప్రతీకగా నిలిచింది. స్వగ్రామం నుంచి కాలినడకన తిరుమల శ్రీవారి సన్నిధికి బయలుదేరిన ఆమెకు మార్గమధ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఘన స్వాగతం పలుకుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకమైనవిగా నిలిచాయి. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి విజయం కోసం ఆయన కుటుంబ సభ్యులు,...