నీట్ రీ-ఎగ్జామ్ కోసం ఏపీ ప్రభుత్వం ఉచిత బస్సు సౌకర్యం!!!!
ఏపీలో నీట్ విద్యార్థులకు ఉచిత APSRTC బస్సు సౌకర్యం – హాల్ టికెట్ చూపించాలి అమరావతి: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET UG 2026) రీ-ఎగ్జామ్ రేపు (జూన్ 21) జరగనుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. ఏపీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) ద్వారా రేపు జరిగే నీట్ రీ-పరీక్షకు వెళ్లే విద్యార్థులందరూ తమ హాల్ టికెట్ చూపించి ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ప్రత్యేకంగా ఎక్కువ డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో అదనపు బస్సులు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ట్రాన్స్‌పోర్ట్ మంత్రి ఎం. రామ్‌ప్రసాద్ రెడ్డి ఈ సౌకర్యం గురించి ప్రకటించారు. విద్యార్థులు, తల్లిదండ్రుల...