సీఎం – డిప్యూటీ సీఎం రాష్ట్రానికి రెండు కళ్ళు : జనసేన నేత నాగరాజు
రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రెండు కళ్లలాంటివారని జనసేన పార్టీ మండల అధ్యక్షుడు చిన్నతోటి నాగరాజు అన్నారు. శుక్రవారం శ్రీకాళహస్తి పట్టణంలోని ఎస్‌ఎస్ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన శ్రీకాళహస్తి నియోజకవర్గ స్థాయి ఎన్‌డీఏ కూటమి విజయోత్సవ సభ అంగరంగ వైభవంగా జరిగింది. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ చర్యలు, ప్రజా పాలనపై ఈ సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, శ్రీకాళహస్తీశ్వర ఆలయ చైర్మన్ కొట్టే సాయి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ హాజరై...