యోగాతో మానసిక ప్రశాంతత సాధ్యం: ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి
యోగాసనాలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతను అందిస్తాయని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం గాలిగోపురం ప్రాంగణంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుతో దేశవ్యాప్తంగా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యోగాంధ్ర కార్యక్రమం ద్వారా ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెంపొందిస్తున్నామని, యోగా వల్ల ఒత్తిడి తగ్గి రోగనిరోధక శక్తి పెరుగుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ రోజూ యోగా అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు.