బీసీ రిజర్వేషన్లపై విస్తృత అధ్యయనం.. ప్రజల వినతులకు ప్రాధాన్యం
గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలుపై సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర అధ్యయనం నిర్వహిస్తున్నట్లు డెడికేటెడ్ కమిషన్ చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా తెలిపారు. తిరుపతి కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో బీసీ సంఘాల ప్రతినిధులు తమ అభిప్రాయాలు, సమస్యలు, సూచనలు కమిషన్‌కు సమర్పించారు. జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ మాట్లాడుతూ జిల్లాలో అందిన ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి సమగ్ర నివేదిక రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తామని తెలిపారు. వాస్తవ పరిస్థితుల ఆధారంగా రిజర్వేషన్లపై నిర్ణయాలు తీసుకునే ప్రక్రియకు ఈ అధ్యయనం ఉపయోగపడుతుందన్నారు.