విద్యార్థుల భద్రతపై రవాణాశాఖ ప్రత్యేక తనిఖీలు.. 3 బస్సులు సీజ్
విద్యార్థుల రవాణా భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ జిల్లా రవాణాశాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా విద్యాసంస్థల బస్సులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. శ్రీకాళహస్తి, పుత్తూరు, సూళ్లూరుపేటతో పాటు తిరుపతి నగర పరిధిలో తనిఖీలు చేపట్టి ఫిట్‌నెస్, పన్నులు, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్, ఫస్ట్ ఎయిడ్, స్పీడ్ గవర్నర్ వంటి భద్రతా ప్రమాణాలను పరిశీలించారు. త్రైమాసిక పన్నులు చెల్లించని మూడు బస్సులను సీజ్ చేసి, వివిధ ఉల్లంఘనలపై 12 వాహనాలపై కేసులు నమోదు చేసి రూ.లక్ష జరిమానా విధించారు. విద్యార్థుల భద్రత విషయంలో నిర్లక్ష్యాన్ని సహించబోమని హెచ్చరించారు.