చెంగారెడ్డిపల్లిలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం
రేణిగుంట మండల పరిధిలోని చెంగారెడ్డిపల్లి గ్రామంలో బుధవారం ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమం నిర్వహించారు. అధికారులతో కలిసి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంటింటికి వెళ్లి ఓటరు వివరాలను పరిశీలించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజల సమస్యలను కూడా తెలుసుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల ఉపాధ్యక్షులు సూరి రాయల్, కరకంబాడి పంచాయతీ గ్రామ కమిటీ అధ్యక్షుడు ధనుంజయులు, వీఆర్వో రమేష్ పాల్గొన్నారు.