నీళ్ల విరోచనాలకు ఓ.ఆర్.ఎస్. సంజీవని: డిప్యూటీ హెచ్.ఈ.ఓ. మహమ్మద్ రఫీ
వాయల్పాడు (రాజనీతి, జూన్ 17: నీళ్ల విరోచనాలను (డయేరియా) సమర్థవంతంగా నియంత్రించడంలో ఓ.ఆర్.ఎస్. (ORS) పొడి సంజీవనిలా పనిచేస్తుందని డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ అన్నారు. 'స్టాప్ డయేరియా కాంపెయిన్'లో భాగంగా బుధవారం ఆయన గండబోయినపల్లిలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లో నిర్వహిస్తున్న టీకాల కార్యక్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా టీకాల కొరకు చిన్నారులతో హాజరైన తల్లులకు ఓ.ఆర్.ఎస్. ప్యాకెట్ల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించి, వాటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ హెచ్.ఈ.ఓ. మాట్లాడుతూ.. జూన్ 16 నుండి జూలై 31 వరకు 'స్టాప్ డయేరియా' ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. నీళ్ల విరోచనాల వల్ల ఐదు సంవత్సరాల లోపు పిల్లలు...