సవాళ్లు కాదు.. ప్రజా సమస్యలపై పోరాటం చేయండి: ధ్రువకుమార్

వేంపల్లె జూన్ 17 రాజనీతి : గత వారం రోజులుగా టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి,వైసీపీ కడప ఎంపీ అవినాష్ రెడ్డి సవాళ్లు,ప్రతి సవాళ్లు చేసుకుంటున్నారని, వీరికి ఏమాత్రం ప్రజా సమస్యలపై శ్రద్ధ ఉందా అని కాంగ్రెస్ పార్టీ పులివెందుల నియోజకవర్గ ఇంచార్జీ మూలంరెడ్డి ధ్రువకుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం వేంపల్లెలో విలేకరులతో మాట్లాడిన ఆయన.. "బీటెక్ రవి, అవినాష్ రెడ్డిలు ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుతూ ప్రజా సమస్యలను గాలికి వదిలేశారు. పులివెందుల ప్రాంత అభివృద్ధి గురించి వీరికి ఏమాత్రమైన శ్రద్ధ ఉందా?" అని ప్రశ్నించారు. మెడికల్ కాలేజీ,జగనన్న కాలనీలపై పోరాడండి: పులివెందులలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల విషయంపై,జగనన్న కాలనీలపై,ఆయా ప్రజా సమస్యలపై...