తప్పిపోయిన వ్యక్తి ఆచూకీ కోసం పోలీసుల వెతుకులాట
పీలేరు : అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణ పరిధిలో నివసిస్తున్న లక్కె నాగిరెడ్డి (38) అనే వ్యక్తి ఈ నెల 2వ తేదీ (02-06-2026) నుండి కనిపించకుండా పోయినట్లు పీలేరు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్. రాజు కుమారుడైన లక్కె నాగిరెడ్డి, జూన్ 2న ఉదయం సుమారు 11:30 గంటల సమయంలో పీలేరు మండలంలోని ఎల్లమండ క్రాస్ వద్ద నుండి కుటుంబ సమస్యల కారణంగా ఇంటి నుండి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అతను తిరిగి రాకపోవడంతో అతని భార్య లక్కె అంజలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులు, బంధువులు పీలేరు పట్టణంతో పాటు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో విస్తృతంగా గాలించినప్పటికీ అతని...