దివ్యాంగులకు ఉచిత ఆధునిక కృత్రిమ కాళ్ల అమరిక శిబిరం
-ఆదర్శ సేవా సమితి పిలుపు వై.ఎస్.ఆర్ (కడప) మరియు అన్నమయ్య జిల్లాల్లోని దివ్యాంగుల కోసం జులై 2026 నెలలో ఉచిత ఆధునిక వెయిట్‌లెస్ కృత్రిమ కాలు (Artificial Limb) అమరిక 'అమెరికా శిబిరం' నిర్వహించనున్నట్లు ఆదర్శ ప్రత్యేక ప్రతిభావంతుల సేవా సమితి అధ్యక్షులు పి.వి.చలపతి, కార్యదర్శి కే. వి. రమణ ఒక ప్రకటనలో తెలిపారు. రూ. 51,000/- విలువైన ఈ అత్యాధునిక కృత్రిమ కాళ్లను అర్హులైన దివ్యాంగులకు పూర్తిగా ఉచితంగా అందించడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. జులై నెలలో లబ్ధిదారులకు సంబంధించిన కాలు కొలతలు తీసుకోవడం జరుగుతుంది.కొలతలు తీసుకున్న సుమారు 10 రోజుల వ్యవధిలోనే రూ. 51,000/- విలువైన ఆధునిక వెయిట్‌లెస్ కృత్రిమ కాలును ఉచితంగా...