వ్యాధులు సోకని బిడ్డతోనే బలమైన ముందు తరం సాధ్యం: వైద్యాధికారి డాక్టర్ శ్రీ గిరీష
తలుపుల : డయేరియా (అతిసార) సోకిన పిల్లలకి ఓఆర్‌ఎస్ రక్షణ, జింక్ మాత్రల శక్తితో నీళ్ల విరోచనాలకు అడ్డుకట్ట వేయవచ్చని తలుపుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) ప్రధాన వైద్యాధికారి డాక్టర్ శ్రీ గిరీష తెలిపారు. 'స్టాప్ డయేరియా' (అతిసార నియంత్రణ) కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా మంగళవారం తలుపులలో ఆరోగ్య సిబ్బందికి ప్రత్యేక శిక్షణ, అవగాహన సదస్సు మరియు ర్యాలీ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీ గిరీష మాట్లాడుతూ.. పిల్లలకు విరోచనాలు అయ్యే సమయంలో తల్లులతో పాటు కుటుంబ సభ్యులు కూడా పూర్తి అవగాహన కలిగి వేగంగా స్పందించి బిడ్డ ప్రాణాలను కాపాడాలని కోరారు. ఐదేళ్ల లోపు (0-5 సంవత్సరాల) పిల్లల మరణాల...