పల్స్ పోలియో, స్టాప్ డయేరియా కార్యక్రమాలను విజయవంతం చేద్దాం: వైద్యాధికారులు

వాయల్పాడు (రాజనీతి): ఈనెల 28వ తేదీ ఆదివారం నిర్వహించబోయే ఐపీపీఐ (ఉధృత పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం) మరియు జూన్ 16 నుండి జూలై 31 వరకు జరిగే 'స్టాప్ డయేరియా' (అతిసార నియంత్రణ) కార్యక్రమాలను విజయవంతం చేయాలని చింతపర్తి ఇంచార్జి వైద్యాధికారి డాక్టర్ ఆశిక్, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక పీహెచ్‌సీలో ఈ రెండు కార్యక్రమాలపై ఆశా, అంగన్‌వాడీ, ఆరోగ్య కార్యకర్తలు, ఎమ్మెల్హెచ్‌పీలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జూన్ 28న ఆదివారం రోజున అప్పుడే పుట్టిన పసిబిడ్డ నుండి ఐదేళ్ల లోపు పిల్లలందరికీ నిర్దేశించిన బూత్‌లలో తప్పనిసరిగా రెండు పోలియో చుక్కలు...