బీజేపీ అగ్రనేత అద్వానీకి అస్వస్థత.. ఆసుపత్రిలో చికిత్స!

రాజనీతి | న్యూఢిల్లీ | అక్టోబర్‌ 17, 2026 బీజేపీ సీనియర్‌ నేత, భారత మాజీ ఉప ప్రధాని లాల్‌కృష్ణ అద్వానీ అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో ఇన్ఫెక్షన్‌ కారణంగా ఆయనను శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం 98 ఏళ్ల అద్వానీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. శుక్రవారం సాయంత్రం సుమారు 7.30 గంటల సమయంలో అద్వానీని ఆసుపత్రికి తీసుకువచ్చారు. శ్వాసకోశ సంబంధిత సమస్యల నేపథ్యంలో పల్మనాలజీ విభాగంలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రత్యేక వైద్యుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది. అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు. ఈ ఏడాది...