ఒక్క ఆహ్వానంతో పెళ్లి వార్తలకు తెర.. అనిరుధ్‌–కావ్య మారన్‌ రిసెప్షన్‌ ఖరారు

రాజనీతి | హైదరాబాద్‌ | అక్టోబర్‌ 17, 2026 దక్షిణాది సినీ సంగీత ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు పొందిన సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సీఈవో కావ్య మారన్‌ల వివాహ వార్తలపై కీలక పరిణామం చోటుచేసుకుంది. వీరిద్దరి వివాహ రిసెప్షన్‌ నవంబర్‌ 21న చెన్నైలో జరగనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. దీంతో కొంతకాలంగా సోషల్‌ మీడియాలో కొనసాగుతున్న వీరి పెళ్లి ప్రచారం మరోసారి చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రికి ప్రత్యేక ఆహ్వానం సన్‌ గ్రూప్‌ చైర్మన్‌ కళానిధి మారన్‌, ఆయన సతీమణి కావేరి మారన్‌ శుక్రవారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. తమ కుమార్తె కావ్య మారన్‌, సంగీత దర్శకుడు...