చిత్తూరు మేయర్ అభ్యర్థిగా కటారి హేమలత
చిత్తూరు(రాజనీతి): ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చిత్తూరు నగర మేయర్ అభ్యర్థిగా కటారి హేమలత పేరును తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. మేయర్ అభ్యర్థి ఎంపికపై కూటమి నేతల మధ్య చర్చలు జరిగిన అనంతరం ఆమె పేరును ఖరారు చేసినట్లు తెలిసింది.చిత్తూరు నగర పాలక సంస్థలో మేయర్ పదవిని దక్కించుకునే దిశగా టీడీపీ తన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతోంది. ఈ నేపథ్యంలో కటారి హేమలతను అభ్యర్థిగా ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీ అధిష్ఠానం తీసుకున్న ఈ నిర్ణయంతో స్థానిక రాజకీయాల్లో మేయర్ అభ్యర్థి ఎంపికపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. రానున్న ఎన్నికల్లో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి విజయం సాధించేలా కృషి చేయాల్సి ఉంది....