చిత్తూరులో బీసీల ఆత్మీయ సమ్మేళనం.. భారీగా తరలివచ్చిన మహిళలు...రెండు వేల మందికి పైగా మహిళలతో ద్రాక్షాయణి ఆధ్వర్యంలో ర్యాలీ...

చిత్తూరు(రాజనీతి): బీసీలకు రాజకీయంగా ప్రాధాన్యతనిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని టీడీపీ మహిళా నాయకురాలు టి.ఎం. ద్రాక్షాయణి పేర్కొన్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించిన నేపథ్యంలో బుధవారం చిత్తూరులో బీసీల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సీనియర్ టీడీపీ నాయకుడు కాజూరు బాలాజీ, ఆయన సతీమణి ద్రాక్షాయణి ఆధ్వర్యంలో రెండు వేల మందికి పైగా మహిళలు భారీ ర్యాలీలో పాల్గొన్నారు. ఇరువారం నుంచి ప్రారంభమైన ర్యాలీ దుర్గమ్మ ఆలయం మీదుగా బీసీ భవన్‌కు చేరుకుంది.ఈ సందర్భంగా ద్రాక్షాయణి మాట్లాడుతూ... బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంతోనే సాధ్యమైందని పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలంతా ఐక్యంగా నిలిచి...