ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డికి శ్రీ లక్ష్మీ గణపతి డైమండ్ హౌస్ ప్లాట్ అసోసియేషన్ వినతి
రేణిగుంట అక్టోబర్ 13 (రాజనీతి):రేణిగుంట పంచాయతీ పరిధిలోని లక్ష్మి వెంకటేశ్వర నగర్ లో నివసిస్తున్న కుటుంబాలకు పంచాయతీ తాగునీటి కనెక్షన్లు మంజూరు చేసి, నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ శ్రీ లక్ష్మీ గణపతి డైమండ్ హౌస్ ప్లాట్ అసోసియేషన్ ప్రతినిధులు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. కలుషిత నీటితో ఇబ్బందులు ఎల్.వి. నగర్‌కు సమీపంలోని మరో వెంచర్లో సుమారు 40 కుటుంబాలకు ఇప్పటికే పంచాయతీ నీటి కనెక్షన్లు కల్పించారని అసోసియేషన్ ప్రతినిధులు వినతిపత్రంలో పేర్కొన్నారు. అయితే పక్కనే ఉన్న తమ వెంచర్‌కు మాత్రం పంచాయతీ నీటి కనెక్షన్లు ఇవ్వలేదని తెలిపారు. తమ ప్రాంతంలో ప్రస్తుతం వస్తున్న నీటిలో రసాయనాలు కలిసిన నీరు,...