ఏపీలో స్థానిక ఎన్నికలకు ముహూర్తం.. రేపే షెడ్యూల్‌?

రాజనీతి | అమరావతి | అక్టోబర్‌ 13, 2026 ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పంచాయతీల ఎన్నికలపై నెలకొన్న ఉత్కంఠకు త్వరలో తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్టోబర్‌ 14న స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు వేగవంతం కావడంతో రాజకీయ పార్టీల దృష్టి ఎన్నికల సంఘం ప్రకటనపై కేంద్రీకృతమైంది. అక్టోబర్‌ 14న ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం | మున్సిపల్‌ రిజర్వేషన్ల ఖరారుతో వేగం పుంజుకున్న కసరత్తు | నోటిఫికేషన్‌ కోసం రాజకీయ పార్టీల ఎదురుచూపులు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల...