శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు పటిష్ట భద్రత

తిరుపతి అక్టోబర్ 12 (రాజనీతి): తిరుమలలో అక్టోబర్‌ 12 నుంచి 20 వరకు జరగనున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు 2,800 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ ఎల్‌. సుబ్బరాయుడు తెలిపారు. గరుడసేవ సందర్భంగా రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు వెల్లడించారు. సీసీటీవీలు, డ్రోన్లు, ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపడతామని, భక్తులకు సహాయంగా ‘మే ఐ హెల్ప్‌ యూ’ పోలీసు బృందాలను అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు.