సముద్రంలో మునిగిన వలసదారుల ఆశలు.. 139 మంది జలసమాధి!

రాజనీతి | అంతర్జాతీయం | అక్టోబర్‌ 12, 2026 మెరుగైన జీవితం కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లాలన్న వందలాది మంది వలసదారుల ఆశలు సముద్రంలో కలిసిపోయాయి. తూర్పు ఆఫ్రికాలోని జిబౌటి దేశం నుంచి యెమెన్‌కు బయలుదేరిన వలసదారుల పడవ బోల్తాపడిన ఘటనలో మృతుల సంఖ్య 139కి పెరిగింది. మృతుల్లో 15 మంది చిన్నారులు ఉండటం విషాదాన్ని మరింత తీవ్రతరం చేసింది. మరో 84 మంది ఆచూకీ తెలియకపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదముందని ఐక్యరాజ్యసమితి అనుబంధ అంతర్జాతీయ వలసల సంస్థ (ఐఓఎం) ఆందోళన వ్యక్తం చేసింది. ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు బయలుదేరి మృత్యువాత | మృతుల్లో 15 మంది చిన్నారులు.. మరో 84...