పండుగ వేళ సామాన్యులకు ఊరట.. రూ.85 బియ్యం రూ.50కే!
రాజనీతి | అమరావతి | అక్టోబర్ 12, 2026 పండుగల వేళ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో సతమతమవుతున్న సామాన్య ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపశమనం కల్పించే చర్యలు చేపట్టింది. బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్న బియ్యం, గోధుమ పిండి, ఉల్లిపాయలను రైతుబజార్ల ద్వారా రాయితీ ధరలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 151 రైతుబజార్లలో సన్నబియ్యం విక్రయాలను ప్రారంభించింది. విజయవాడ భవానీపురం రైతుబజార్లో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏపీలో 151 రైతుబజార్లలో రాయితీ ధరలకు నిత్యావసరాలు | గోధుమ పిండి కిలో రూ.25.. ఉల్లిపాయలు రూ.35 | డీమార్ట్ కంటే 35 శాతం తక్కువ ధరకు కందిపప్పు...