120 మంది విద్యార్థులకు రక్త వర్గ నిర్ధారణ పరీక్షలు
వాయల్పాడు అక్టోబర్ 10 (రాజనీతి): సేవా సంకల్ప అభియాన్లో భాగంగా వాయల్పాడులోని ఎన్టీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రక్త వర్గ నిర్ధారణ వైద్య శిబిరం నిర్వహించారు. కమ్యూనిటీ ఆసుపత్రి వైద్యుడు డా. శ్రవణ్ నాయక్ ఆధ్వర్యంలో సుమారు 120 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి రక్త వర్గాలను గుర్తించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. పి. విక్టోరియా రాణి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని, రక్తదానంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. అత్యవసర సమయాల్లో రక్త వర్గం తెలుసుకోవడం ప్రాణరక్షణకు దోహదపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో అధ్యాపకులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.