ఇక వాట్సాప్‌లోనే కుల ధ్రువీకరణ పత్రం.. రూ.40 చెల్లిస్తే చాలు!

రాజనీతి | అమరావతి | అక్టోబర్‌ 10, 2026 ఆంధ్రప్రదేశ్‌లో కుల ధ్రువీకరణ పత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే కుల ధ్రువీకరణ పత్రం పొందిన పౌరులు ఇకపై వాట్సాప్‌ ద్వారానే దాని ప్రతిని తిరిగి పొందే అవకాశాన్ని కల్పించింది. ‘మన మిత్ర’ వాట్సాప్‌ గవర్నెన్స్‌ వేదిక ద్వారా కేవలం రూ.40 రుసుము చెల్లించి కుల ధ్రువీకరణ పత్రాన్ని పీడీఎఫ్‌ రూపంలో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ మేరకు రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ (ఆర్టీజీఎస్‌) కొత్త సేవను ప్రారంభించింది. రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగే పనికి చెక్‌.. ‘మన మిత్ర’లో కొత్త...