‘ప్రజాస్వామ్య పునరుద్ధరణ అప్పుడే మొదలవుతుంది’ అంటూ రాహుల్‌ సంచలన వ్యాఖ్యలు..

రాజనీతి | న్యూఢిల్లీ | అక్టోబర్‌ 10, 2026 ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌తో పాటు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా పదవి నుంచి దిగిపోతుందని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. ఆ తర్వాతే దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పునరుద్ధరణ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై ప్రతిపక్షాలు ఆందోళనలు కొనసాగిస్తున్న నేపథ్యంలో శనివారం సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. జ్ఞానేశ్‌ కుమార్‌ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్‌ చేస్తున్న రాహుల్‌, సమస్య ఒక్క ఎన్నికల కమిషనర్‌కే పరిమితం కాదని, ప్రస్తుత ప్రభుత్వ వ్యవస్థలోనే లోతైన సమస్యలు...