మానసిక ఆరోగ్యానికి మందులే కాదు.. మనసు విప్పి చెప్పే అవకాశం కావాలి!

రాజనీతి | ఆరోగ్యం – జెనీవా | అక్టోబర్‌ 10, 2026 మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తుల మాటలను కేవలం వినడమే కాకుండా, వారి అనుభవాలను ఆరోగ్య విధానాల రూపకల్పనలో భాగం చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) పిలుపునిచ్చింది. అక్టోబర్‌ 10న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది ప్రత్యేక సందేశాన్ని విడుదల చేసింది. మానసిక సమస్యలను ప్రత్యక్షంగా ఎదుర్కొన్న వ్యక్తులకు చికిత్స, సంరక్షణ వ్యవస్థల్లో ఎదురయ్యే ఇబ్బందులపై ప్రత్యేక అవగాహన ఉంటుందని, వారి సూచనలను పరిగణనలోకి తీసుకుంటే మరింత మెరుగైన సేవలను అందించవచ్చని స్పష్టం చేసింది. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా డబ్ల్యూహెచ్‌ఓ కీలక పిలుపు.....