రాష్ట్రపతి వద్దకు ‘ఓటు చోరీ’ వివాదం.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఫిర్యాదు!
రాజనీతి | న్యూఢిల్లీ | అక్టోబర్ 9, 2026 దేశంలో ఓటర్ల జాబితాల సవరణ, ఎన్నికల నిర్వహణపై వివాదం మరింత ముదిరింది. ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్న ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి తాజాగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ఆశ్రయించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సహా పది మంది సభ్యుల ప్రతినిధి బృందం శుక్రవారం రాష్ట్రపతి భవన్లో ముర్ముతో సమావేశమైంది. ‘ఓటు చోరీ’ ఆరోపణలు, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై తమ అభ్యంతరాలను వివరిస్తూ నాలుగు ప్రధాన డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేసింది. మా ఆరోపణలను...