రైతు భూమిపై హక్కు రైతుదే.. కాపాడే బాధ్యత మాది: చంద్రబాబు
రాజనీతి | ప్రకాశం జిల్లా | అక్టోబర్ 9, 2026 రైతుల భూములపై వారి హక్కులను కాపాడే పూర్తి బాధ్యత తమ ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రైతులు నాగలి పట్టుకుని పొలాలకు వెళ్లాలే తప్ప అర్జీలు పట్టుకుని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండకూడదని పేర్కొన్నారు. శుక్రవారం ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలోని జరుగుమల్లి మండలం నర్సింగోలులో నిర్వహించిన ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్పుస్తకాలను పంపిణీ చేశారు. భూమి రైతుదేనని, దానిపై హక్కును పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యతని ప్రకటించారు. రైతులు అర్జీలతో ఆఫీసుల చుట్టూ...