ప్రాణాలకు తెగించి 174 మందిని కాపాడిన భారత పైలట్‌కు ఇజ్రాయెల్‌ అత్యున్నత పురస్కారం!

రాజనీతి | టెల్‌అవీవ్‌ | అక్టోబర్‌ 9, 2026 ఆకాశంలో ప్రాణాపాయ స్థితిలోనూ అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించి విమానంలోని 174 మంది ప్రాణాలను కాపాడేందుకు కీలకంగా వ్యవహరించిన భారతీయ పైలట్‌ కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌కు ఇజ్రాయెల్‌ ప్రభుత్వం అత్యున్నత పౌర సాహస పురస్కారాన్ని ప్రకటించింది. సెప్టెంబర్‌ 30న ఫ్లైదుబాయ్‌ విమానంలో జరిగిన దాడి సమయంలో తీవ్రంగా గాయపడినప్పటికీ ప్రయాణికుల ప్రాణాలను రక్షించేందుకు ఆయన చేసిన ప్రయత్నాలను గుర్తిస్తూ ‘ప్రెసిడెన్షియల్‌ అవార్డ్‌ ఫర్‌ సివిలియన్‌ హీరోయిజం’ అందజేయనున్నట్లు ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు ఐజాక్‌ హెర్జోగ్‌ ప్రకటించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న మచ్చర్‌ పూర్తిగా కోలుకున్న తర్వాత స్వయంగా పురస్కారాన్ని ప్రదానం చేస్తామని వెల్లడించారు. సెప్టెంబర్‌ 30న దుబాయ్‌ నుంచి...