బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల ఆశలపై సుప్రీం తీర్పు.. ప్రభుత్వ పిటిషన్‌ కొట్టివేతతో కీలక మలుపు

రాజనీతి | అమరావతి | అక్టోబర్‌ 9, 2026 ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ రిజర్వేషన్లకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను శుక్రవారం కొట్టివేసింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలుపై నెలకొన్న న్యాయపరమైన వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. 34 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పును సమర్థించిన సర్వోన్నత న్యాయస్థానం.. ప్రభుత్వ పిటిషన్‌ కొట్టివేత | స్థానిక...