అమెరికాలో 8 ఐటీ దిగ్గజాలకు భారీ షాక్‌.. గ్రీన్‌కార్డుల ప్రక్రియ నిలిపివేత!

రాజనీతి | వాషింగ్టన్‌ | అక్టోబర్‌ 8, 2026 అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ శాశ్వత నివాస హోదా కోసం ఎదురుచూస్తున్న విదేశీ ఐటీ నిపుణులకు ట్రంప్‌ ప్రభుత్వం భారీ షాక్‌ ఇచ్చింది. గ్రీన్‌కార్డుల మంజూరులో కీలకమైన పర్మనెంట్‌ లేబర్‌ సర్టిఫికేషన్‌ (PERM) కార్యక్రమం నుంచి ఎనిమిది ప్రముఖ టెక్నాలజీ కంపెనీలను సస్పెండ్‌ చేస్తున్నట్లు అమెరికా కార్మిక శాఖ గురువారం ప్రకటించింది. ఈ జాబితాలో మైక్రోసాఫ్ట్‌, అడోబ్‌, కాగ్నిజెంట్‌, ఇన్ఫోసిస్‌, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌), విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, క్యాప్‌జెమినీ ఉన్నాయి. ఈ సంస్థలకు సంబంధించిన కొత్త PERM దరఖాస్తులను స్వీకరించబోమని, ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిశీలనను కూడా నిలిపివేస్తామని అమెరికా కార్మిక శాఖ...