నరిగపల్లి దాహం తీర్చిన గోపీనాథ్.. బోర్లో జలధార!
చిత్తూరు(రాజనీతి): ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న చిత్తూరు నియోజకవర్గ శాసనసభ్యులు గురజాల జగన్మోహన్కు మరో శుభవార్త అందింది. చిత్తూరు నియోజకవర్గ పరిధిలోని 16వ డివిజన్ నరిగపల్లి ఎస్టీ కాలనీలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు డివిజన్ ఇన్చార్జ్ గోపీనాథ్ ఆధ్వర్యంలో బోర్వెల్ ఏర్పాటు చేయగా.. సమృద్ధిగా మంచి నీరు లభించింది. సుమారు 5 అంగుళాల మేర నీరు పడటంతో స్థానికుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఎన్నో రోజులుగా తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న నరిగపల్లి ఎస్టీ కాలనీ ప్రజలకు బోర్ ద్వారా నీరు లభించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మిక్కిలి సంతోషం వ్యక్తం చేశారు....