టీబీ అంతానికి యువత భాగస్వామ్యం కీలకం

పీలేరు అక్టోబర్ 8 (రాజనీతి): టీబీ రహిత సమాజం నిర్మాణంలో యువత భాగస్వామ్యం ఎంతో కీలకమని పీలేరు ఎంపీడీవో శివశంకరయ్య అన్నారు. టీబీ నిర్మూలనలో భాగంగా జోష్‌ (జాయింట్‌ స్క్వాడ్‌ ఫర్‌ హెల్త్‌) బృందం ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు. పీలేరు టీబీ నియంత్రణ అధికారి డా. చంద్రశేఖర్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీడీవో మాట్లాడుతూ టీబీపై అవగాహన, ప్రచారాన్ని బలోపేతం చేసేందుకు జోష్‌ బృందాలు కృషి చేయాలన్నారు. అనంతరం గోడపత్రికను ఆవిష్కరించి టీబీ నిర్మూలన ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో డా. రాధామాధవి, డిప్యూటీ హెచ్‌ఈఓ కొండయ్య, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.