జీవితంలోని ప్రతి దశలో కళ్లను కాపాడుకోవాలి
పీలేరు అక్టోబర్ 8 (రాజనీతి): కళ్ల ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నమయ్య జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రోగ్రాం అధికారి డా. శివప్రతాప్ సూచించారు. ప్రపంచ 27వ దృష్టి దినోత్సవాన్ని పురస్కరించుకుని పీలేరు ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ డా. చంద్రశేఖర్ అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. స్క్రీన్ సమయాన్ని తగ్గించాలని, కళ్లను క్రమం తప్పకుండా వైద్యులతో పరీక్షించుకోవాలని, పోషకాహారం తీసుకుంటూ తగిన విశ్రాంతి కల్పించాలని వైద్యులు సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ హెచ్ఈఓ కొండయ్య, కంటి వైద్య సహాయకురాలు శోభారాణి, సిబ్బంది పాల్గొన్నారు.