అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు?.. మంత్రి నారా లోకేశ్
రాజనీతి | అమరావతి | అక్టోబర్ 8, 2026 ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నెలకొన్న ఉత్కంఠ మధ్య రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ నెలలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉందని వెల్లడించారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న నిర్ణయానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గురువారం అమరావతిలో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన ఇష్టాగోష్టిలో ఆయన స్థానిక ఎన్నికలు, రిజర్వేషన్లు, నామినేటెడ్ పదవుల భర్తీపై పలు అంశాలను ప్రస్తావించారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై వెనక్కి తగ్గేది లేదని స్పష్టీకరణ.. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎన్నికల షెడ్యూల్పై...