ఏపీ రాష్ట్ర ఆర్టీఐ కార్యదర్శి అభి మారన్కు ఘన సన్మానం
తిరుపతి, అక్టోబరు 8 (రాజనీతి): సమాచార హక్కు చట్టం సాధన కమిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా సేవలందిస్తున్న తిరుపతి జిల్లాకి చెందిన వెట్టి వెంకటేష్ (అభి మారన్)కు హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ఘన సన్మానం లభించింది. గురువారం నిర్వహించిన సమాచార హక్కు చట్టం సాధన కమిటీ ద్వితీయ ఆవిర్భావ వేడుకల్లో ఆయనను కమిటీ జాతీయ చైర్మన్ చంటి ముదిరాజ్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు సూర స్రవంతి, మల్లం వెంకటేష్గౌడ్ తదితరులు శాలువా, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. హైదరాబాద్లోని రవీంద్రభారతి ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి సమాచార హక్కు చట్టం సాధన కమిటీ ప్రతినిధులు, సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమం ఉత్సాహభరిత...