రుచి, నాణ్యతకు కేరాఫ్ జమ్ జమ్ ఫ్యామిలీ రెస్టారెంట్..... ఘనంగా జమ్ జమ్ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభం

ఏర్పేడు, అక్టోబరు 7 (రాజనీతి): ఏర్పేడు టోల్‌ప్లాజా సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన జమ్‌జమ్‌ ఫ్యామిలీ రెస్టారెంట్‌ గురువారం ఘనంగా ప్రారంభమైంది. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై రిబ్బన్‌ కట్‌ చేసి రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా రెస్టారెంట్‌ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. రేణిగుంట ప్రాంతంలో రుచికరమైన, నాణ్యమైన ఆహార పదార్థాలతో పాటు బిరియానీకి జమ్‌జమ్‌ మంచి పేరు సంపాదించుకుందని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు. అదే నాణ్యత, రుచిని ఏర్పేడు ప్రాంత ప్రజలకు కూడా అందించేందుకు నూతన ఫ్యామిలీ రెస్టారెంట్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఏర్పేడు టోల్‌ప్లాజా సమీపంలో రెస్టారెంట్‌ అందుబాటులోకి రావడం వల్ల స్థానిక ప్రజలతో పాటు ఈ...