జంతర్ మంతర్ వైపు విపక్షాల మార్చ్.. రోడ్డుపై పడుకున్న ప్రియాంక
రాజనీతి | జాతీయం | అక్టోబర్ 7, 2026 ఢిల్లీలో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ఇండియా కూటమి ఎంపీలు చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారింది. జంతర్ మంతర్ వైపు వెళ్తున్న విపక్ష ఎంపీలను పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా రోడ్డుపై పడుకుని నిరసనకు దిగారు. పోలీసులు తనను నేలపైకి తోసేశారని, మహిళా పోలీసు సిబ్బంది తనను పలుచోట్ల గీసారని ఆమె ఆరోపించారు. అనంతరం పోలీసులు ఆమెను అక్కడి నుంచి తరలించి అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని, ఓటర్ల జాబితా సవరణపై తమ అభ్యంతరాలను పరిగణనలోకి...