ఈసీకి వ్యతిరేకంగా విపక్షాల ఆందోళన కొనసాగింపు.. జ్ఞానేష్‌ కుమార్‌పై తీవ్ర ఆరోపణలు

రాజనీతి | జాతీయం | అక్టోబర్‌ 7, 2026 ఢిల్లీలో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా విపక్షాల ఆందోళన మరింత ఉధృతమైంది. ‘ఓట్‌ చోరీ’ ఆరోపణలు, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఇండియా కూటమి ఎంపీలు బుధవారం జంతర్‌ మంతర్‌ వద్ద నిరసనకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ తనపై నమోదవుతున్న ఎఫ్‌ఐఆర్‌లపై స్పందిస్తూ.. “నా లక్ష్యం 100 ఎఫ్‌ఐఆర్‌లు” అని వ్యాఖ్యానించారు. తనపై నమోదయ్యే ప్రతి ఎఫ్‌ఐఆర్‌ను ఒక మెడల్‌గా భావిస్తానని తెలిపారు. ‘నా లక్ష్యం 100 ఎఫ్‌ఐఆర్‌లు’.. జంతర్‌ మంతర్‌కు రాహుల్‌ అంతకుముందు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ఆధ్వర్యంలో ఢిల్లీలోని సాగర్‌ రత్న రెస్టారెంట్‌లో విపక్ష...