డ్రోన్లకు ఇక లేజర్–మైక్రోవేవ్ ఆయుధాలే.. అమెరికా కీలక నిర్ణయం!
రాజనీతి | అంతర్జాతీయం | అక్టోబర్ 6, 2026 ప్రపంచవ్యాప్తంగా డ్రోన్ల వినియోగం పెరుగుతున్న వేళ అమెరికా మరో అడుగు ముందుకేసింది. డ్రోన్ దాడులను అడ్డుకునేందుకు హై-ఎనర్జీ లేజర్, హై-పవర్ మైక్రోవేవ్ టెక్నాలజీలపై దృష్టి సారించింది. తాజాగా నాలుగు డైరెక్టెడ్ ఎనర్జీ ఆయుధ వ్యవస్థలను ఎంపిక చేసి ఆపరేషనల్ స్థాయిలో పరీక్షించేందుకు నిర్ణయించింది. నాలుగు ఆయుధ వ్యవస్థలు ఇవే.. అమెరికా ఎంపిక చేసిన వ్యవస్థల్లో AeroVironment Palletised High-Energy Laser, Epirus Leonidas High-Powered Microwave, Kord Firefly High-Energy Laser, Boeing Compact Laser Weapon System ఉన్నాయి. వీటిని అమెరికా సైన్యానికి చెందిన Joint Interagency Task Force 401 ఆధ్వర్యంలో పరీక్షించనున్నారు....