మెట్రో నగరాల్లో కుంగుతున్న భూమి.. అసలు కారణాలేంటి?
రాజనీతి | నేషనల్ | అక్టోబర్ 5, 2026 దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో కనిపించని మరో ప్రమాదం క్రమంగా పెరుగుతోంది. అదే భూమి కుంగుబాటు (Land Subsidence). భూమి ఒక్కసారిగా పగిలిపోవడం లేదా భారీగా కిందికి జారిపోవడం మాత్రమే కాదు.. కొన్ని ప్రాంతాల్లో ఏళ్ల తరబడి నెమ్మదిగా భూమి దిగజారుతుండటం కూడా సబ్సిడెన్స్లో భాగమే. తాజాగా ఢిల్లీ, ముంబయి, కోల్కతా, బెంగళూరు, చెన్నై నగరాలపై జరిగిన అధ్యయనం ఈ సమస్య తీవ్రతను వెల్లడించింది. అసలు భూమి ఎందుకు కుంగుతుంది? భూగర్భ జలాల మితిమీరిన వినియోగం నుంచి భారీ నిర్మాణాల వరకు.. నగరాల కింద భూమి నెమ్మదిగా కుంగిపోవడానికి అనేక కారణాలు భూమి కింద ఉన్న...