28 వేల అడుగుల మేర ఒక్కసారిగా కిందికి.. బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ విమానంలో ఎమర్జెన్సీ!

రాజనీతి | అంతర్జాతీయం | అక్టోబర్‌ 5, 2026 లండన్‌ నుంచి అమెరికాలోని చికాగోకు బయలుదేరిన బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ BA295 విమానంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఐర్లాండ్‌ గగనతలంలో ప్రయాణిస్తున్న సమయంలో విమానం ఒక్కసారిగా భారీగా దిగువకు వచ్చింది. ఫ్లైట్‌-ట్రాకింగ్‌ డేటా ప్రకారం సుమారు 37 వేల అడుగుల నుంచి 9 వేల అడుగుల ఎత్తుకు, అంటే దాదాపు 28 వేల అడుగుల మేర విమానం దిగింది. అనంతరం పైలట్లు అంతర్జాతీయ ఎమర్జెన్సీ ట్రాన్స్‌పాండర్‌ కోడ్‌ 7700ను సెట్‌ చేసి విమానాన్ని లండన్‌ వైపు మళ్లించారు. 7 వేల అడుగుల ఎత్తు నుంచి 9 వేల అడుగులకు వేగంగా దిగిన విమానం.. 7700 ఎమర్జెన్సీ కోడ్‌తో...