ప్రపంచం అల్లకల్లోలంగా ఉంది.. భారత్ సవాళ్లను ఎదుర్కొంటుంది: జైశంకర్
రాజనీతి | న్యూఢిల్లీ | అక్టోబర్ 5, 2026 ప్రపంచం ప్రస్తుతం అనిశ్చితి, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య అస్థిరతతో కూడిన దశలో ఉందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న 5వ కౌటిల్య ఎకనామిక్ కాన్క్లేవ్ ముగింపు సమావేశంలో ఆయన ప్రపంచ పరిణామాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. రష్యా-ఉక్రెయిన్, అమెరికా-ఇరాన్ ఘర్షణలతో పాటు టారిఫ్లలో మార్పులు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. ‘చాలా మార్పులు జరుగుతున్న కాలం’ యుద్ధాలు.. టారిఫ్ల అస్థిరత.. ఇంధనం, ఆహారం, ఎరువులపై ఒత్తిడి.. మారుతున్న ప్రపంచ పరిస్థితులపై విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు ప్రపంచం ఒక రకంగా “ఏజ్ ఆఫ్ ఫ్లక్స్”లోకి ప్రవేశించిందని జైశంకర్ అభివర్ణించారు....