పదో వార్డులో కుమార్‌ హవా.. కౌన్సిలర్‌ రేసులో పేరు?...

చిత్తూరు (రాజనీతి): చిత్తూరు నియోజకవర్గం పదో వార్డులో టీడీపీ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ కుమార్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సాధారణ ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూనే పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ సూచనలు, ప్రోత్సాహంతో కుమార్ వార్డులో పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రజా సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు.పదో వార్డులో కుమార్‌కు ప్రజల్లో క్రమంగా మంచి గుర్తింపు లభిస్తోందని, రాబోయే రోజుల్లో ఆయనను కౌన్సిలర్‌గా పోటీ చేయిస్తే ప్రజల నుంచి మంచి స్పందన ఉంటుందనే చర్చ స్థానికంగా వినిపిస్తోంది. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్న...