పేదలను రాజకీయాలకు అడ్డుపెట్టుకోవడం సరికాదు... బుజ్జి నాయుడు

రేణిగుంట, అక్టోబరు 3 (రాజనీతి): రేణిగుంట మండల పరిధిలోని శ్రీనివాసపురం గ్రామంలో రోడ్డు విస్తరణకు సంబంధించి ఇళ్లు కోల్పోయిన బాధితులకు న్యాయం జరిగేలా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి చొరవ తీసుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ తారకరామనగర్‌ క్లస్టర్‌ ఇన్‌చార్జ్‌ బుజ్జి నాయుడు తెలిపారు. శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో 2023లో శ్రీనివాసపురం ప్రాంతానికి సంబంధించి అవార్డు ప్రక్రియ జరిగినప్పటికీ కొంతమంది బాధితులకు మాత్రమే పరిహారం అందిందన్నారు. మిగిలిన బాధితుల సమస్యను 2024 ఎన్నికల సమయంలో తమ దృష్టికి తీసుకురావడంతో, వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చామని బుజ్జి నాయుడు తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన అనంతరం శ్రీనివాసపురం బాధితుల సమస్యను ఎమ్మెల్యే...