అవార్డు అందుకున్న రోజా చౌదరి కు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అభినందనలు!...
చిత్తూరు(రాజనీతి): ఎన్నో ప్రతికూల పరిస్థితులను అధిగమించి జీవితంలో ముందుకు సాగిన చిత్తూరుకు చెందిన రోజా చౌదరికి అరుదైన గౌరవం లభించింది. ఆమెకు ప్రతిష్ఠాత్మక ‘సౌత్ ఇండియా ఉమెన్ అచీవర్స్ అవార్డు’ దక్కింది. చెన్నైలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో సీఈఓ దీపక్ టాటర్ జైన్ చేతుల మీదుగా రోజా చౌదరి పురస్కారాన్ని అందుకున్నారు.చిన్ననాటి నుంచే ఎదురైన ఇబ్బందులు, జీవితంలో ఎదురైన ఒడిదుడుకులను ధైర్యంగా ఎదుర్కొంటూ రోజా చౌదరి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగిన ఆమె ప్రయాణం పలువురికి స్ఫూర్తిగా నిలిచింది. పట్టుదల, ధైర్యంతో కష్టాలను అధిగమిస్తే విజయాన్ని సాధించవచ్చని ఆమె ప్రస్థానం చాటిచెబుతోంది. *ఎమ్మెల్యేను కలిసిన రోజా* అవార్డు...