అమరావతికి వరద ముప్పు లేకుండా పక్కా ప్లాన్.. 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం!

రాజనీతి | అమరావతి | అక్టోబర్‌ 3, 2026 డచ్‌ నిపుణుల సహకారంతో వరద నియంత్రణ వ్యవస్థ.. 22,500 క్యూసెక్కుల నీటిని బయటకు పంపే పంపింగ్‌ సామర్థ్యం ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో వరదలు, వర్షపు నీటి నిల్వ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా ప్రత్యేక వ్యవస్థను రూపొందిస్తున్నట్లు పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. గత 200 ఏళ్లలో నమోదైన వర్షపాతం, వరద పరిస్థితులను అధ్యయనం చేసిన అనంతరం ప్రణాళిక సిద్ధం చేసినట్లు వెల్లడించారు. డచ్‌ నిపుణుల సాంకేతిక సహకారం అమరావతి వరద నియంత్రణ వ్యవస్థ రూపకల్పనలో నెదర్లాండ్స్‌కు చెందిన నిపుణుల సహకారం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. భారీ వర్షాలు కురిసినప్పుడు నీటిని వేగంగా...